శ్రీ మహాలక్ష్మి ఇన్నోవేటీవ్స్ బ్యానర్ పై పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ నిర్మాతలుగా సతీష్ గుండేటి దర్శకత్వం లో సమర్, అక్షిత, కిమయ హీరో హీరోయిన్స్ గా రూపొందిన చిత్రం 'కొత్త కొత్తగా ఉన్నది'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటివలే జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు బిగ్ సిడీ, మొదటి సిడీ ను ఆవిష్కరించి ఎం.ఎల్.ఎ రసమయి బాలకిషన్ గారికి అందించారు.
ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ " ఒకప్పుడు సినిమా అంటే హిట్, ఎబో ఆవరేజ్, ఆవరేజ్, బిలో ఆవరేజ్ అని మూడు స్టేజ్ లు ఉండేవి. ఇప్పుడంతా హిట్టు ఫట్టు అని రెండు స్తేజిలు మాత్రమే ఉంటున్నాయి. ఇక ఇలాంటి సమయం లో ఒక దర్శకుడి ను నమ్మి కొత్త వారి తో సినిమా నిర్మించడం ఒక ఎత్తు అయితే సినిమాను మంచి పబ్లిసిటీ చేసి విడుదల చెయ్యడం మరో ఎత్తు అనే చెప్పాలి. ఈ చిత్ర దర్శకుడు సతీష్ గతం లో నా శిష్యుడు కోడి రామ కృష్ణ దగ్గర అలాగే రవి రాజా పిని శెట్టి దగ్గర పనిచేశాడని తెలిసింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. ఇక నా దృష్టి లో సినిమాకు ముందు ఆడియో విడుదల కార్యక్రమం చెయ్యడం అనవసరమనే చెప్పాలి. సినిమా విడుదలకి ముందే ఇలా సినిమాలో ఉన్న క్రీం ను ముందే పాటల రూపం లో ట్రైలర్ ల రూపం లో చూపించేస్తే ఆ సినిమాకు అంచనాలు పెరుగుతాయి. చివరికి సినిమాలో ఏం మిగలడం లేదు. అందుకే ఇప్పుడు ఎక్కువ సినిమాలు సక్సెస్ అందులేకపోతున్నాయి. ఇక చిన్న చిత్రాల కు అంటే ఇలాంటి ఫంక్షన్స్ కాస్త అవసరమే కాని పెద్ద సినిమాలకు ఆడియో ఫంక్షన్స్ వద్దు అని ఈ ఆడియో సభా పూర్వకంగా చెప్తున్నాను. "అని అన్నారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "టైటిల్ లో కొత్తదనం ఉంది. ఈ సినిమాలో మరింత కొత్త దనం ఉంటుందని ఉండాలని ఆశిస్తూ ఈ సినిమాతో ఈ టీం అందరు నిరూపించుకోవాలని అలా నిరూపించుకుంటే వీరితో నేను కూడా ఓ సినిమా చేస్తాను " అని అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ " ప్రభాకర్ గారు రంగ స్థల నటుడు ఆయన నిర్మాతగా మారి నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. సతీష్ చాలా నమ్మకం తో ఈ సినిమాను తెరకెక్కించాడు. వంశీ మ్యూజిక్ బాగుంది. మంచి మెలోడీ దర్శకుడిగా ఎదుగుతాడని అనిపిస్తుంది. ఈ సినిమాతో ఆరడుగుల అందం తో హీరో ఆకట్టుకుంటాడని భావిస్తున్నా. ఈ చిత్రం తో అందరు మంచి గుర్తింపు అందుకొని మరిన్ని సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా"అని అన్నారు.
భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ " టైటిల్ ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటె ఖచ్చితంగా విజయం అందుకుంటుంది.సినిమాలో కొత్తదనం ఉంటుందని అనుకుంటున్నాను. ఇక దర్శకుడు సతీష్ కు నిర్మాతలకు నా శుభాకాంక్షలు. "అని అన్నారు.
చిత్ర దర్శకుడు సతీష్ మాట్లాడుతూ "నాకు జన్మ ఇచ్చింది మా అమ్మ నాన్న అయితే దర్శకుడిగా సినిమా జన్మ ఇచ్చింది మాత్రం మా నిర్మాతే. కొత్త కొత్త గా ఉండే ప్రేమ కథా చిత్రమిది. యువత కి బాగా కనెక్ట్ అవుతుంది"అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ " సతీష్ ఈ కథ చెప్పా గానే కొత్త గా ఉందే అనుకోని ఈ సినిమాను నిర్మించాం. వంశీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించి సినిమా చూసాక మౌత్ టాక్ తో సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం"అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ "నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. దర్శకుడు మంచి పాటలు కంపోస్ చేయడానికి వీలున్న స్విట్చు వేషన్స్ ఇచ్చారు. పాటలను విజయవంతం చేసి సినిమాను కూడా హిట్ చెయ్యాలని కోరుకుంటున్నా"అని అన్నారు.
హీరో మాట్లాడుతూ" దర్శకుడు సతీష్ గారు నాతో బాగా నటింపజేయించారు.మొదటి సినిమాతోనే ఇద్దరి హీరోయిన్స్ తో నటించడం కొత్తగా ఉంది. మమ్మల్ని ఆశీర్వదించి సినిమాను హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను"అన్నారు. తనకు ఈ పాత్రా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది చిత్ర కథానాయిక కిమయ.
ఇంకా ఈ కార్యక్రమం లో విజయ్ కుమార్ కొండ, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎడ్ల సుధాకర్ రెడ్డి, శివ కుమార్ మార్కాపురం తదితరులు పాల్గొని చిత్రం విజయం సాధించాలని ఆశించారు.
This website uses cookies.