Dhan Raj’s Pani Leni Puli Raju Movie Audio Released

‘పనిలేని పులిరాజు’ పాటలు విడుదల

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పనిలేని పులిరాజు’. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేరుగా మార్కట్లోకి విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ...

నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ’ మా పనిలేని పులిరాజు చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. శనివారం సినిమా పాటలను మార్కెట్లోకి డైరెక్ట్ విడుదల చేశాం. తప్పకుండా పాటలు అందరికీ నచ్చుతాయి. సినిమాను జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పాటలు సినిమాలో హైలైట్ గా వుంటాయి’’ అని అన్నారు.

సహ నిర్మాత రవి.కె.పున్నం మాట్లాడుతూ ‘’ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్ కు మంచి ఆదరణ వచ్చింది. శనివారం మార్కెట్లోకి పాటలు విడుదల చేశాం. రఘుబాబు కామెడీ, నటన సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాను జూన్ మూడో వారంలో విడుదల చేస్తాం’’అన్నారు.

దర్శకుడు చాచా మాట్లాడుతూ ‘ధనరాజ్ నటన సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. వివి మంచి సంగీతాన్ని ఇచ్చారు. సినిమాలో హాస్యమే ప్రధానంగా వుంటుంది.’ అని అన్నారు.

ప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి,రఘుబాబు, కొండవలస, కోటేశ్వరరావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి,సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి. లక్షి, నిర్మాత: పి.వి. నాగేష్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: చాచా.

Facebook Comments
Share
More

This website uses cookies.