Social News XYZ     

‘Chandi Yagam’ – A Spiritual film on Telangana Yugapurushudu

తెలంగాణ యుగ పురుషుడి ఆధ్యాత్మిక విజయ గాథ చండీయాగం చిత్రం

'Chandi Yagam' - A Spiritual film on Telangana Yugapurushudu
తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్ని కాపడటం కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్ తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో గ్రాఫికల్ సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్న వేళ చండీయాగం చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాత తెలియజేశారు.

వేల సంవత్సరాల ఘనమైన సంస్కృతి, చరిత్ర కలిగిన తెలంగాణని... కొన్ని వందల సంవత్సరాలుగా...బాణిసత్వంలో మగ్గుతున్న పరిస్థితుల్లో... అనేకమంది మహనీయులు తెలంగాణ విముక్తి కోసం పరితపిస్తూ... విభిన్న రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో.... తెలంగాణ సమాజం ఆకాంక్షలకు ఆశాకిరణంగా అవతరించి.. తెలంగాణకు స్పేచ్ఛా వాయువులు అందించిన భరతమాత ముద్దుబిడ్డ దైవాంశ సంభూతుడు... కారణ జన్ముని ఆధ్యాత్మిక శక్తితో సాధించిన విజయ గాథను అత్యంత ప్రతిష్టాత్మకంగా, గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, నటీనటులతో నిర్మించనున్నారు. జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ వెంకటా చారి ఎర్రోజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి యువ దర్శకుడు విశ్వన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. కవి సిద్ధార్థ మాటలందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తారు.

ఈ సందర్భంగా..... చిత్ర నిర్మాత జగదాంబ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ వెంకటా చారి ఎర్రోజు మాట్లాడుతూ... ప్రపంచానికి మార్గదర్శకుడిగా, యువతకు స్ఫూర్తిదాయకంగా సాగిన కారణజన్ముని విజయ యాత్రను తెలంగాణ సమాజానికే కాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో అనేక మంది మేధావులు, మహనీయుల సలహాలు సూచనలతో, సహాయ సహకార పర్యవేక్షణలో గత సంవత్సరన్నర కాలంగా అత్యంత పగడ్భందీగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తెలంగాణ సమాజం మొత్తం ఒక పండగలా సంబురాలు చేసుకునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భాన మా చండీయాగం చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. విశ్వన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

 

బ్యానర్ - జగదాంబ ప్రొడక్షన్స్
నిర్మాత - శ్రీ వెంకటాచారి ఎర్రోజు
మాటలు - కవి సిద్ధార్థ
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - విశ్వన్

Facebook Comments