మహిళా దర్శకురాలు వైషు తను దర్శకత్వం లో వి.టి.ప్రెజెంట్స్ పతాకం పై లోకేష్ దాసరి నిర్మించిన లఘు చిత్రం 'పిక్చర్'. నటీ నటులు వంశీ, కృష్ణ తేజ్, దివ్య శ్రీపాద లతో తెరకెక్కిన ఈ లఘు చిత్రాన్ని ఇటివలే ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఈ లఘు చిత్రం పై స్పందించారు ఆయన మాట్లడుతూ " తను అనుకున్న పాయింట్ ను కూల్ గా సింపుల్ గా చెప్పారు దర్శకురాలు వైషు. ఒక మంచి పాయింట్ తో సున్నితంగా రూపొందిన ఈ షార్ట్ ఫిలిం నాకు బాగా నచ్చింది. టీం హార్డ్ వర్క్ కనిపించింది. ఇలాంటి షార్ట్ ఫిలిం చూసినప్పుడు నాలో చాలా హప్పినెస్ కలుగుతుంది. ఈ షార్ట్ ఫిలిం వైషు కి టీం కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను" అన్నారు.
యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ "ఈ షార్ట్ ఫిలిం ను వైషు గారు నాకు చూపించడం జరిగింది. ఒక మంచి కాన్సెప్ట్ తో చాలా గ్రాండ్ గా తీసిన షార్ట్ ఫిలిం ఇది. మంచి పాయింట్ తో ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే తో వైషు ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. ప్రేక్షకుడి లో ఆసక్తి కలిగిస్తే ఆ దర్శకుడు సక్సెస్ సాధించినట్లే. సో వైషు దర్శకురాలిగా సక్సెస్ అయిపోయింది. మ్యూజిక్, కెమెరా వర్క్, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ బాగా నచ్చాయి.అల్ ది బెస్ట్ టు ది టీం " అని అన్నారు.
దర్శకుడు సై రాజేష్ మాట్లాడుతూ "వైషు చాలా ప్రతిభ కల ఆమ్మాయి. తన ప్రతిభ ను ఈ షార్ట్ ఫిలిం తో నిరూపించుకుంది. తన ఎఫర్ట్ కనిపించింది. 'పిక్చర్' పర్ఫెక్ట్ గా ఉంది. వైషు త్వరలోనే వెండి తెర దర్శకురాలిగా ఎదగాలని ఆశిస్తున్నా" అన్నారు.
లఘు చిత్ర దర్శకురాలు వైషు తను మాట్లాడుతూ " నా ప్రతిభ ను నిరూపించుకోవడం తో పాటు ఒక సందేశ్యం ఇవ్వాలన్న ఉద్యేశ్యం తోనే ఈ షార్ట్ ఫిలిం చేసాను. 'పిక్చర్'అందరినీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది. ముందుగా నాకు సపోర్ట్ అందించి ఈ షార్ట్ ఫిలిం ను ప్రొడ్యూస్ చేసిన లోకేష్ కి నా ధన్యవాదాలు. అలాగే ఈ షార్ట్ ఫిలిం ను తన ఆశిస్సులు అందించిన పూరి జగన్నాథ్ గారికి నా కృతజ్ఞతలు" అన్నారు.
ఈ కార్యక్రమం లో లఘు చిత్ర నటీ నటులు, టెక్నిషియన్స్, నిర్మాత పాల్గొన్నారు.
అతి త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం పూరి జగన్నాథ్ యూ ట్యూబ్ ఛానల్ విడుదల కానుందని తెలిపారు.
This website uses cookies.