Gautamiputra Satakarni Completes Its First Schedule

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదటి షెడ్యూల్ పూర్తి

తెలుగు ప్రేక్షకలు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల మొరాకాలో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ పూర్తయింది.

బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. ఇటీవల జాతీయఅవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లోఇంత పెద్ద షెడ్యూల్ (రెండు వారాల పాటు) చిత్రీకరణను జరుపుకున్న మొదటి తెలుగు సినిమాయే కాదు, మొదటి ఇడియన్ మూవీ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కావడం విశేషం. మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో సినిమా చిత్రీకరణను జరుపుకుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో హీరో నందమూరి బాలకృష్ణ, కబీర్ బేడికి మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 1000 మంది ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రెండు వందల గుర్రాలు, ఒంటెలను ఉపయోగించారు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కావడం గురించి..

దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ… నందమూరి బాలకృష్ణగారి వందవ చిత్రంగా ఎంతో ప్రెస్టిజియస్ గా ప్రారంభమైన మా గౌతమీపుత్ర శాతకర్ణి మొరాకోలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సినిమా అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి కావడం హ్యాపీగా ఉంది. ఈ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణగారు ప్రతి రోజు పద్నాలుగు గంటల పాటు వర్క్ చేశారు. షూటింగ్ వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటిక్ ఉండేవారో చిత్రీకరణ ముగుస్తున్నప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉండేవారు. ఆయన ఎనర్జీ మాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణగారితో పాటు, నటీనటులు, టెక్నిషియన్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.

ప్రణాళిక ప్రకారం సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి కావడం పట్ల నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: భూపేష్ భూపతి, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

Facebook Comments
Share

This website uses cookies.