Venu Movies debut project with Naveen Chandra

గతంలో రెండు దశాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వందలకు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వేణు మూవీస్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి వేణు మాధవ్ నిర్మాతగా అత్యున్నత సాంకేతిక విలువలతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నారు. జి.గోపి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా ఆగస్టు నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుందని చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

ఈ చిత్రానికి సహ నిర్మాత: వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్.

Facebook Comments
Share

This website uses cookies.