అల్లు శిరీష్ సరసన అందాల భామ మెహరీన్
అల్లు శిరీష్ హీరోగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇటీవలే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిప్రముఖుల సమక్షంలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో తన అందంతో, అభినయంతో ఆకట్టుకొని విమర్శకుల ప్రశంసలందుకున్న మెహరీన్ అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఖరారు చేశారు. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' తర్వాత శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న రెండో తెలుగు సినిమా ఇది.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ... ‘’శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ వారికిది తెలుగులో రెండో చిత్రం కాగా, నాకు నాల్గవ చిత్రం. డైరెక్టర్ ఎం.వి.ఎన్. రెడ్డి తండ్రి మల్లిడి సత్యనారాయణగారు అన్నయ్యతో బన్ని అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా మెహరీన్ ను ఫైనల్ చేశాం. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రంలో మెహరీన్ నటనకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రంలో మా క్యారెక్టర్స్ డిఫరెంట్ గా ఎంటర్ టైనింగ్ గా ఉండనున్నాయి. ఈ చిత్రానికి సంజయ్ లోక్ నాథ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు తర్వాత ఈ సినిమా జులై నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది. ’’ అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన ఎస్.శైలేంద్రబాబు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు తర్వాత వస్తున్న రెండో తెలుగు సినిమా. మా బ్యానర్ లో పద్దెనిమిదో సినిమా. దర్శకుడు మంచి కథను అందించారు. అల్లు శిరీష్ గారికి థాంక్స్. చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యముంటుంది. అందుకే కృష్ణ గాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశాం. ’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు ఎం.వి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ... ‘’మంచి లవ్ ఎంటర్ టైనర్ తో పాటు... మంచి కాన్సెప్ట్, సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ వున్న కమర్షియల్ చిత్రంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అల్లు శిరీష్ సరసన మెహీరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వారిద్దరి పెయిర్ చాలా బాగుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. జూలై మొదటి వారం నుండి సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ’’ అన్నారు.
అల్లు శిరీష్, మెహరీన్ జంటగా నటించనున్న ఈ చిత్రానికి పి.ఆర్.వో: ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కో డైరెక్టర్: రాధాకృష్ణ పూసల, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, ఆర్ట్: బ్రహ్మ కడలి, మ్యూజిక్: జిబ్రాన్, నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి, దర్శకత్వం: ఎం.వి.ఎన్.రెడ్డి.