Nenu Seetha Devi Movie Audio Launched

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ఆవిష్కరించిన 'నేను సీతాదేవి' ఆడియో.

కీ.శే.శ్రీమతి చిటుకుల అరుణ సమర్పణలో సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'నేను సీతాదేవి'. శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్య రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం.ఎస్.రాజు, పాశం యాదగిరి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను విడుదల చేసిన ఎం.ఎస్.రాజు తొలి సీడీని యాదగిరి రెడ్డికి అందించారు.

ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ ‘’పాటలు బావున్నాయి. యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సంగీత దర్శకుడు చైతన్య రాజా మాట్లాడుతూ ‘’మ్యూజిక్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ దొరకడం ఆనందంగా ఉంది. నాలుగు పాటలు నాలుగు ఆణిముత్యాలు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ మల్లం మాట్లాడుతూ ‘’కథ వినగానే సందీప్ వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాడు. తనకు థాంక్స్. అలాగే రణధీర్ మంచి సపోర్టింగ్ రోల్ చేశాడు. సీత, దేవి అనే ఇద్దరమ్మాయిల కథ ఇది. చైతన్య మ్యూజిక్, సునీల్ కశ్యప్ రీరికార్డింగ్, శివ జి.కె. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతాయి. ఓ మంచి సినిమా చేశామని చెప్పగలను. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత, హీరో సందీప్ మాట్లాడుతూ ‘’ఈ సినిమా నేను చేయడానికి ప్రధాన కారణం మా నాన్నగారు. నేను సినిమాల్లోకి వెళతాననగానే ఆయనే నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రోత్సాహంతోనే హీరోగా, నిర్మాతగా ఈ చిత్రాన్ని చేశాను. మంచి కథ, దర్శకుడు శ్రీనివాస్ గారు సినిమా చక్కగా తెరకెక్కించారు. చైతన్య గారు మంచి మ్యూజిక్ అందించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

రణధీర్ మాట్లాడుతూ ‘’సందీప్ గారి కంటే సందీప్ గారి నాన్నగారే రియల్ హీరో. ఆయన ప్రోత్సాహంతో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రతి ఒక్కరం బాగా కష్టపడి చేసిన సినిమా ఇది. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్రయూనిట్ ను అభినందించారు.

జీవా, వెన్నెలకిషోర్, గుండు హనుమంతరావు, అంబటి శ్రీను, ధనరాజ్, చిత్రం శ్రీను, విశ్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: సన్ని కోమలపాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సునీల్ కశ్యప్, సంగీతం: చైతన్య రాజా, నిర్మాత: చిటుకుల సందీప్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ మల్లం.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%