విడుదల సన్నాహాల్లో "వసుధైక 1957"
అరుణశ్రీ కంబైన్స్ పతాకంపై శ్రీమతి అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "వసుధైక 1957". హైదరాబాద్ లో 1957లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ద్వారా "బాల" అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
బ్రహ్మాజీ, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, షాని ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెలాఖరున విడుదల కానుంది.
ఈ సందర్భంగా అరుణశ్రీ కంబైన్స్ అధినేత నిడమలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. "దర్శకత్వశాఖలో పలు సంవత్సరాలు పని చేసిన "బాల"ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "వసుధైక 1957" చిత్రాన్ని నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
దర్శకుడు బాల మాట్లాడుతూ.. "1957లో ఓ అయిదేళ్ళ పాప జీవితంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం "వసుధైక 1957". సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలన్నీ కలగలిసిన ఈ హారర్ ఎంటర్ టైనర్ దర్శకుడిగా నాకు మంచి భవిష్యత్తునిస్తుందనే నమ్మకముంది" అన్నారు.
బేబీ యోధ, కారుణ్య, పావని, శ్రీలత, సుభాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. ఎడిటర్: గోపీ సిందం, కెమెరా: తిరుమలరావు, మాటలు-పాటలు: భాషశ్రీ, సంగీతం: అమోఘ్ దేశపతి, కథాసహకారం-కో డైరెక్టర్: మహేష్ పెద్దబోయిన, సమర్పణ: శ్రీమతి అరుణ, నిర్మాత: నిడమలూరి శ్రీనివాసులు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాల!!