Prabhudeva Intro Song For Abhinetri In RFC

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ షూటింగ్‌ ఈరోజు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్స్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ పాటలో ఎమీ జాక్సన్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించబోతోంది.

ఈ సందర్భంగా కోన ఫిలిం కార్పొరేషన్‌ బేనర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ – ”ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను ఈరోజు స్టార్ట్‌ చేశాం. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీసెట్స్‌లో అంత కంటే భారీగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. నాలుగు రోజులపాటు ఈ పాటను చిత్రీకరించడం జరుగుతుంది. ఈ పాటలో ఎమీ జాక్సన్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ కాబోతోంది. ఇండియాలోని టాప్‌ టెక్నీషియన్స్‌ ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేయడం విశేషం. మదరాసు పట్టణం, నాన్న, అన్న వంటి డిఫరెంట్‌ చిత్రాలను రూపొందించిన విజయ్‌ ఈ చిత్రాన్ని చాలా ఎక్స్‌ట్రార్డినరీగా రూపొందిస్తున్నారు. అన్‌కాంప్రమైజ్డ్‌గా 70 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పించడం చాలా ఆనందంగా వుంది” అన్నారు.

నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ – ”’బాహుబలి’ చిత్రంలో తన అద్భుత నటనతో అందర్నీ ఆకట్టుకున్న తమన్నా ఫస్ట్‌ టైమ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోంది. అనుష్కకు ‘అరుంధతి’, జ్యోతికకు ‘చంద్రముఖి’లా తమన్నాకు ‘అభినేత్రి’ ఓ అద్భుతమైన చిత్రమవుతుంది. ఈరోజు ప్రారంభమైన ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా భారీ సెట్స్‌లో ఈ పాటను తీయడం జరుగుతోంది” అన్నారు.

ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, ప థ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

Facebook Comments
Share

This website uses cookies.