Kannada movie ‘141 I Love You’ dubbed into Telugu as Tella Chera Nalla Cheera

డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ‘ఎర్రచీర-నల్లచీర’(141)

కన్నడంలో ‘141’ ఐ లవ్ యూ పేరుతో విడుదలై సంచలన సృష్టించిన చిత్రం. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన యదార్థ ప్రేమకథ ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఎర్రచీర-నల్లచీర’ పేరుతో విడుదల చేస్తున్నారు.

ఆ సందర్భంగా దర్శక నిర్మాత బావాజి మాట్లాడుతూ ‘’నిజంగా జరిగిన కథాంశం. ఈ చిత్రం విడుదలయ్యే వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది. సెన్సార్ లో కూడా అనేక సవాళ్లను దాటుకుని ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%