పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన 'దండుపాళ్యం' ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న 'దండుపాళ్యం2' చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''దండుపాళ్యం తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు.
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ - ''మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ డూపర్‌హిట్ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నాం. ఇప్పటివరకు 40 రోజుల షూటింగ్ జరిగింది. 70 శాతం సినిమా పూర్తయింది. ఆఖరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం'' అన్నారు.
This website uses cookies.