AMBICA wins No 1 brand in India award

భారత దేశం లో నెం.1 బ్రాండ్ గా అంబికా అగర బత్తి

గత 70 ఏళ్ళుగా భగవంతుడికి భక్తుడికి అనుసందానం అనే నానుడి తో విశేష ప్రాచుర్యం పొందిన అంబికా దర్బార్ బత్తి కి భారత దేశం లో అత్యధిక ప్రజాదరణతో వినియోగం కలిగిననెం.1 బ్రాండ్ గా ప్రజల నుండి పూర్తి మద్దతు లబించిందని అంబికా గ్రూప్ సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. అమెరికా కు చెందినా ఐ బి సి ఇన్ఫో మీడియా ప్రైవేటు లిమిటెడ్ నిర్వహించిన ఒక సర్వే లో ప్రజల నుండి డైరెక్ట్ గా వచ్చిన వోటింగ్ ఆధారం గా ఎంపిక చేసిన సంస్థలలో అంబికా అగర బత్తి కి కూడా ప్రజలు పట్టం కట్టారని అంబికా కృష్ణ తెలిపారు. ఇటివల ముంబై లోని హోటల్ లీల లో జరిగిన ఓ కార్యక్రమం లో సంస్థ ఇండియా విభాగపు సి ఈ ఓ హేమంత్ ఈ అవార్డు ను అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ, సంస్థ డైరెక్టర్ అంబికా రామంజనేయులకు అంద జేసారు.

భారత దేశం లో నెం.1 బ్రాండ్ ప్రాచుర్యం పొందిన ఉత్పతుల పైన మరియు సేవల పైన గత 15 ఏళ్ళుగా మీడియా రిసెర్చ్ గ్రూప్ (యంఅర్ర్ జి ) నిర్వహించిన ఆన్ లైన్ సర్వే లో లభించిన పలితాలను ప్రకటించిన సంస్థ, ఎన్నికైన ఆయ సంస్థ లకు అవార్డు లు అందచేసింది. వీటిలో విజేతలుగా నిలిచినవి అట్లాస్, హింద్వే, యల్ ఐ సి, జిందాల్ పైప్స్, తాజ్ హోటల్స్, టాటా రూపింగ్,బేసన్ హోమేయో , ఫాక్ట్ ఎరువులు, హాల్ మార్క్ కోకోనట్, మహారాష్ట్ర టూరిజం, మొదలైన ప్రజాదరణ పొందిన ఉత్పతులకు ప్రజలు వోటింగ్ చేయగా, వీటికి కూడా అదే రోజున అవార్డు లను అందచేసారు. అతున్నత ప్రమాణాలతో తమ సంస్థ గత ఏడు దశాభ్దలుగా నిర్విరామంగా నాణ్యమైన అగరాబత్తి లను ప్రజలకు అందిస్తున్నామని, దానికి గుర్తింపుగా ఇప్పుడు దేశంలోనే పేరెన్నిక గల సంస్థల సరసన తమ బ్రాండ్ చేరడం తమకు ఆనందం కలిగిస్తునదని అంబికా కృష్ణ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

Facebook Comments
Share

This website uses cookies.