Sons of the Soil released “Mr. Rahul Pakka Professional”.

TCPF  రంగారెడ్డి, నల్గొండ & కరీంనగర్ టీమ్స్ ఆధ్వర్యంలో.. తోలి ప్రయత్నంగా 'తెలంగాణా తోలి వినోదభరిత చిత్రం' "మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " సినిమా ఏప్రిల్ 29 న అనగా నేడు  , మీ అభిమాన  థియేటర్స్ లో విడుదల అయ్యింది.. సినిమా నచ్చి, పంపిణి హక్కులను పొంది , సరిఐన సమయం కోసం ఎంతో ఓపిక వహించి , ఏప్రిల్ 29 న తమ లక్షాన్ని  నెరవేర్చుకుని, పంపిణిదారులుగా మారబోతున్న  భూమిపుత్రులకు అభినందనలు !

పంపిణి వ్యవస్థ నిర్మాణానికి ప్రోత్సహించి సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు, ముఖ్యంగా మమ్ములను మనస్పూర్తిగా మా ప్రోగ్రాం కి విచ్చేసి ఆశీర్వదించిన ప్రొఫెస్సర్  కోదండరాం గారికి & మీడియా మిత్రులందరికీ !! కో -ఆపరేటివ్ సొసైటీని స్థాపించాలనుకున్న ఈ కల సాకారం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నా!!

(గమనిక ;- త్వరలో హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో   హైదరాబాద్  & సికింద్రాబాద్  జంట నగరాలలో మంచి సెంటర్లలో ధియేటర్ లను సమకూర్చుకొని త్వరలో సినిమాను విడుదల చేయుటకు   సిద్ధమవుతున్నాము.. పట్టణ  శివార్లలో కొన్ని థియేటర్స్ లో మార్నింగ్ షోస్ కేటాఇంచినప్పటికీ   , మేము వాటిని తిరస్కరించి, మంచి థియేటర్స్ కోసం డిమాండ్ చేయడం జరిగింది)

రెగ్యులర్ ఫోర్ములాలకు భిన్నంగా నిజజీవితాలను ఆవిష్కరిస్తూ , యువతకు నచ్చే విధంగా సందర్భోచిత పాటలతో, ఆరోగ్యకరమైన హాస్య సన్నివేశాలతో, రొమాన్స తో పాటు యువత ఎదుగుదలకు ఉపయోగపడే సందేశాన్ని ఇస్తూ కుటుంబసమేతంగా చూడగలిగేల రూపొందించిన ప్రయోగాత్మక చిత్రమే " మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " సినిమా .

అన్ని సినిమాల్లాగా ఎంతో ఖర్చుపెట్టి ప్రచారాలు చేసి ధియేటర్ లను సమకూర్చుకొని సినిమాను విడుదల చేసి, బాగుందో లేదో అనే సంగతి మార్నింగ్ షో రిపోర్ట్ ద్వార తెలుసుకోవడం కంటే ఒక వందమంది సామాన్య ప్రేక్షకులకు చూపించి ప్రజాస్పందన ఎలా ఉంటుందో తెసుకోవడం జరిగింది . 95% మందికి నచ్చితేనే ముందుకెల్లుదాం లేకుంటే లేదని అనుకున్నాం. చుసిన వాళ్ళందరికీ
సినిమా నచ్చడమే కాకుండా, ఆ వందమందిలో కొందరు కొన్ని జిల్లాల పంపిణి హక్కులు కూడా కొనుగోలు చేయడం జరిగింది, ఆ తరువాత ఒక కో-ఆపరేటివ్ విధానాన్ని అమలుపరిచి రాష్ట్రమంతట మార్చ్ 18 న విడుదల చేయడానికి సిద్దపడ్డాము.

సోషల్ మీడియాలో మా ప్రచార చిత్రాలకు, పాటలకు మరియు పోస్టర్ డిజైన్ లకు మంచి స్పందన వస్తున్నది . యువతకు 'కనపడవద్దు ప్లీజ్ చుస్తేనిన్ను ఐపొతనె ఫ్రీజ్ ' పాట బాగా ఆకట్టుకుంటున్నది. అభిరుచి గల శ్రోతలతొపాటు మేధావులు సైతం 'కొమ్మల్లో ఊగితూగే చిట్టి పొట్టి మొగ్గలు పుయకుండానే వాడిపోయెన' తోపాటు 'కదలర ముందుకు .. పాటలు చాల స్పూర్తిదాయకంగా వినసొంపుగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.

మంచి గ్యాప్ చూసి విడుదలచేద్దాం అనుకుని చాల వెయిట్ చేసాం ఫెబ్రవరిలోనే విడుదల చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు . ప్రతి పండుగ , ప్రతి సెలవుల సమయాల్లో హై బడ్జెట్ సినిమాలు ప్రతి సెంటర్లో ఒక్క ధియేటర్నికూడా వదలకుండా అన్ని ధియేటర్లలో విడుదలచేస్తున్నారు . అలా ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉన్నాయి . కాబట్టి ఇట్లాంటి విధానాన్ని నియంత్రించనంత వరకు లో
బడ్జెట్ సినిమాల విడుదల చేయడం ఇబ్బందికరమే అవుతుంది రోజురోజుకు.

ప్రేక్షకులు "మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ " సినిమాను చుస్తే తప్పకుండా ఒకకోత్తరకమైన వినోదాన్ని ఆస్వాదించిన అనుభూతి మిగులుతుందని మా ప్రివ్యూ చుసిన 100 మంది ప్రేక్షకుల రిపోర్ట్ ఏ మాకు ఎంతో ధైర్యాన్ని కలగ చేసింది. విడుదలైన తొలిరోజే ధియేటర్ కి ప్రేక్షకులు రాగలిగితే సినిమా తప్పకుండ నిలబడుతుంది. మున్ముందు ఇట్లాంటి ప్రయోగాత్మక వినోదభరిత
సినిమాలు తెరకేక్కుతాయి .

Facebook Comments
Share

This website uses cookies.