Maruthi-Dil Raju’s ‘Rojulu Marayi’ First Look Released

మారుతి, దిల్‌రాజు, 'రోజులు మారాయి' ఫస్ట్ లుక్‌ రిలీజ్

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూనే... మరో వైపు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా... వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా.... మారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌-నిర్మాణం లో రూపొందిస్తున్న చిత్రం రోజులు మారాయి. జి.శ్రీనివాస‌రావు నిర్మిస్తున్నఈ చిత్రంతో ముర‌ళీ కృష్ణ ముడిదాని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. చేత‌న్‌ మద్దినేని, పార్వతీశ‌మ్‌, కృతిక‌, తేజ‌స్వి ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు. రోజులు మారాయి చిత్రం మెద‌టి ప్ర‌చార దృశ్యాన్ని విడుద‌ల చేశారు.
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది.

ఈ సంద‌ర్బంగా చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ... మా సంస్థ నుంచి మంచి చిత్రాలు అందించడమే మా లక్ష్యం. బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి కథల్ని... టాలెంటెడ్ దర్శకుల్ని పరిచయం చేస్తుంటామనే విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రోజులు మారాయి చిత్రానికి మా సంస్థ తోడుగా నిలిచింది. ఈ చిత్రానికి మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.  సూపర్ సక్సెస్ లతో నిర్మాతల, హీరోల దర్శకుడిగా దూసుకెళ్తున్న మారుతి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. జి.శ్రీనివాస రావు నిర్మాతగా  రూపొందిస్తున్న రోజులు మారాయి చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మురళీ కృష్ణ ముడిదాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూత్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని న‌మ్ముతున్నాం. మ‌రిన్నివివ‌రాలు అతి త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. అని అన్నారు.

చేత‌న్ మ‌ద్దినేని, పార్వ‌తీశం, కృతిక‌, తేజ‌శ్వి, ఆలీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌,వాసు ఇంటూరి, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, శ‌శాంక్‌, రావిప‌ల్లి రాంబాబు, ఏలూరు శ్రీను, మ‌ధుసుద‌న‌రావు,హ‌ర్ష‌, సంధ్య‌జ‌న‌క్ త‌దిత‌రులు..

క‌థ‌,స్క్రీన్‌ప్లే- మారుతి
స‌మ‌ర్ప‌ణ‌- దిల్ రాజు
సంగీతం- జె.బి
మాట‌లు- ర‌వి నంబూరి

Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Rojulu Maraayimore
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%