కవి పిలింసిటీ పతాకంపై శరత్ కళ్యాణ్ బాబు హీరోగా, బండారు దానయ్య కవి స్వీయదర్శకత్వంలో 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి' చిత్రం ఈ రోజు (29.4.2016) హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గౌడ్ క్లాప్ కొట్టగా, ఆవుల బుచ్చిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేసారు. కిషోర్ గౌడ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత బండారు దానయ్య కవి మాట్లాడుతూ - ''ఇదొక పూర్తి కమర్షియల్ వ్యాల్యూస్ తో తెరకెక్కనున్న చక్కటి కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుంది. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ కమెడీయన్స్ నటించనున్నారు. మే మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపుకోనున్నాం'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా - మోహన్ చంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ.బి.ఆర్ శ్రీనివాసరెడ్డి, సంగీతం, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - బండారు దానయ్య కవి.
This website uses cookies.