TVPC Awards Function

ఘనంగా జరిగిన టి.వి.పి.సి. అవార్డుల వేడుక

టెలివిజన్‌, రేడియో, పత్రికా రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ముగ్గురికి గత ఏడాది నుంచి అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బుర్రె భీమయ్య స్మారక అవార్డును ప్రముఖ రచయిత, రేడియో జర్నలిస్ట్‌, 'పంతులమ్మ' చిత్రానికి సంభాషణలందించిన శ్రీ దివి వెంకట్రామయ్యకు, అగస్త్యశాస్త్రి స్మారక అవార్డును దర్శకుడు, నిర్మాత, ఎడిటర్‌, కెమెరామెన్‌ జి.ఆర్‌.ప్రభుకు, ఎల్‌.కె.శ్రీధర్‌ స్మారక అవార్డును కెమెరామెన్‌ సి.సురేంద్రకు ప్రకటించారు. ఈ అవార్డుల వేడుక ఏప్రిల్ 22న హైదరాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ శ్రీ నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ శ్రీ అల్లం నారాయణ పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలలు మేమెంతోలతో పాటు 10 వేల రూపాయల చేక్కులలు అందించారు. అనారోగ్య కారణాల వాళ్ళ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కెమెరామెన్ సి.సురేంద్రను ఈరోజు శనివారం అయన ఉంటున్న వృద్ధాశ్రమానికి సభ్యులందరూ వెళ్లి మెమెంటోను, 10 వేల రూపాయల నగదు బహుమతిని అందించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు, దర్శకనిర్మాత, సీనియర్‌ జర్నలిస్ట్‌ మహమ్మద్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలో  టెలివిజన్‌ నిర్మాతల మండలి సామాజిక సేవలందించడంలో ఎప్పుడూ ముందుంటుందని, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నందుకు సభ్యులని అభినందించారు ఈ అవార్డుల వేడుకకు విచ్చేసిన అతిథులు.
TVPC Awardsmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Bidhu Shekharmore
Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%