చీపురు పల్లిలో నటసింహ నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ వందరోజుల వేడుక
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఏప్రిల్ 22న ఈ చిత్రం వందరోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 24న చీపురుపల్లి హైస్కూల్ గ్రౌండ్స్ లో సాయంత్రం డిస్ట్రిబ్యూటర్స్, అభిమానుల సమక్షంలో వందరోజుల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, శ్రీవాస్ సహా చిత్రయూనిట్ కూడా పాల్గొంటుంది.
Facebook Comments