Social News XYZ     

Bheemavaram Talkies Horror Entertainer Sasikala” Releasing on 23rd April

ఈ నెల 23న వస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "శశికళ" !!

Bheemavaram Talkies Horror Entertainer Sasikala" Releasing on 23rd April

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన ఓ హారర్ ఎంటర్ టైనర్  తెలుగులో "శశికళ" పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే.  భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల  చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే  వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ ఇది. ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ  "శశికళ" అమితంగా నచ్చుతుంది" అన్నారు.

 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, సంగీతం: నిత్యన్ కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: డా. శివ వై. ప్రసాద్-బి.సత్యనారాయణ, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: విను భారతి!!

Facebook Comments

%d bloggers like this: