తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా 8 సంవత్సరాలు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద మన్మథ, చెలి, రాఘవన్, ఘర్షణ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన మణి నాగరాజ్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'పెన్సిల్'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను పంపిణీ చేసిన సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ - ''నా లేటెస్ట్ మూవీ 'పెన్సిల్' ఆడియో ఆన్‌లైన్‌లో రిలీజ్ అయింది. నా ఫేవరేట్ ఆల్బమ్ ఇది. ఇంతకుముందు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన జి.వి.ప్రకాష్‌గారు ఈ సినిమాకి కూడా ఎక్స్‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నాలుగు పాటలున్నాయి. వై మామా వై, ఎల్‌ఇడి కళ్ళతో, రెండే కళ్ళు ఎన్ని కలలో, వెన్నెలకే వెన్నెలవే. ఇందులో నాకు నచ్చిన పాటలు రెండే కళ్ళు ఎన్ని కలలో, వెన్నెలకే వెన్నెలవే. డెఫినెట్‌గా మీకు కూడా ఈ పాటలు నచ్చుతాయి. ఇందులో శ్రీమణిగారు అన్ని పాటల్ని అద్భుతంగా రాశారు. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై హరిగారు నిర్మిస్తున్నారు. పెన్సిల్ అంటే డెఫినెట్ మన స్కూల్ రోజులే గుర్తొస్తాయి. చిన్నప్పుడు పెన్సిల్ షార్ప్ చేసి చేసి చిన్నగా అయిపోయిన తర్వాత పెన్ క్యాప్ పెట్టి దాన్ని చివరిదాకా యూజ్ చేసేవాళ్ళం. పెన్సిల్ అనగానే అందరికీ వారి వారి స్వీట్ మెమరీస్ గుర్తొస్తాయి. మా 'పెన్సిల్' సినిమా చూసిన తర్వాత మీకు ఏమేం గుర్తొచ్చాయో మాతో షేర్ చేసుకోండి. 'పెన్సిల్' అడ్మిషన్స్ ఈనెలలోనే ఓపెన్ అవుతాయి. ఈ చిత్రాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకండి. అందరూ చూసి ఎంజాయ్ చెయ్యండి'' అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''స్కూల్, కాలేజీ నేపథ్యంలో జరిగే కథ ఇది. యూత్‌ఫుల్‌గా సాగే ఈ కథలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా వుంటుంది. డెఫినెట్‌గా తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కి నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఫస్ట్ టైమ్ నేను తెలుగులో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ సమ్మర్‌కి అందర్నీ ఎంటర్‌టైన్ చేసే మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ చాలా అద్భుతమైన పాటలు అందించారు. 'అత్తారింటికి దారేది' ఫేమ్ శ్రీమణి అద్భుతమైన పాటలు రాశారు. ఈరోజు ఆన్‌లైన్‌లో ఈ ఆడియోను విడుదల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంతో జి.వి.ప్రకాష్ మంచి హీరో అవుతారు. శ్రీదివ్యకి మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. సమ్మర్ స్పెషల్‌గా ఈ నెలలోనే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి'' అన్నారు.
జి.వి.ప్రకాష్‌కుమార్, శ్రీదివ్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో షరీఖ్ హాసన్, విటివి గణేష్, ఊర్వశి, టి.పి.గజేంద్రన్, అభిషేక్ శంకర్, ప్రియా మోష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, సినిమాటోగ్రఫీ: గోపీ అమర్‌నాథ్, ఎడిటింగ్: ఆంటోనీ, ఆర్ట్: రాజీవన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: శ్రీమణి, నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మణి నాగరాజ్.
This website uses cookies.