Hyderabadi Movie Super Star Gullu Dada enters Tollywood with Golmal Gullu

Golmal Gullu Movie Press Meet Photosmore
Golmal Gullu Movie Press Meet Photosmore

హైదరాబాదీ మూవీస్ సూప‌ర్‌స్టార్ గుల్లుదాదా(అద్నాన్ సాజిద్ ఖాన్) తెలుగు సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. దావూద్ మూవీ డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర ద‌ర్శ‌క‌త్వంలో 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఫిలిం' బ్యానర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం గోల్‌మాల్ గుల్లు. ఈ సినిమాలో గుల్లుదాదా(అద్నాన్ సాజిద్ ఖాన్), ప్ర‌ముఖ క‌మెడీయ‌న్ ర‌ఘుబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా, పెంటాలి సేన్, ప్రియాంక‌, వీఎన్ ప‌ద్మావ‌తి, అక్భ‌ర్ ష‌రీఫ్, హ‌స‌ఫ్ స‌మీర్, ఖషీఫ్ అలీ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ఘుబాబు ఇందులో సైంటిస్టు పాత్ర‌లో క‌నిపిస్తూ ఆడియ‌న్స్‌ను అల‌రించ‌బోతున్నారు. హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్రయూనిట్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది.

మీడియా స‌మావేశంలో ర‌ఘుబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను సైంటిస్టులో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలిపారు. హైద‌రాబాదీ సినిమాల స్టార్ గుల్లుదాదా తొలిసారిగా తెలుగు సినిమాలో న‌టిస్తుండ‌టం చాలా సంతోషం. డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర చెప్పిన క‌థ నాకు బాగా న‌చ్చింది. న‌వాబ్‌బాషా వంటి కామెడీ ఎంట‌ర్‌టైన్మెంట్ తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర.. ఈ సినిమాను ఖ‌చ్చింతంగా సూప‌ర్ హిట్ చేస్తాడ‌న్న నమ్మ‌క‌ముంది. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జ‌రుగుతోంద‌ని, ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్లు అంతా ప‌ర్‌ఫెక్టు చేస్తున్నార‌ని ర‌ఘుబాబు అభినందించారు.

డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర మాట్లాడుతూ... హైదరాబాదీ సూప‌ర్‌స్టార్ గుల్లుదాదాను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేస్తున్నాను. నిజానికి హైద‌రాబాదీ సినిమాలు విడుద‌లైన‌ప్పుడు టిక్కెట్లు బ్లాక్‌లో కొని కూడా చూస్తారు. గుల్లుదాదా సినిమాల‌కు అంత క్రేజ్ ఉంది. ఈ గోల్‌మాల్ గుల్లు సినిమాతో టాలీవుడ్‌లోనూ గుల్లుదాదా స్టార్ అవ్వ‌డం ఖాయం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ గోల్‌మాల్ గుల్లు మూవీని త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాము. ఇక‌ ఎమ్మెస్ నారాయ‌ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌వాబ్‌భాషా చిత్రం పూర్తి చేశాను. ఆయ‌న చివ‌రి చిత్రాన్ని అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాము.

గుల్లుదాదా మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డం ఫుల్ హ్యాపీగా ఉంది. నాకు అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర‌గారికి థ్యాంక్స్. హైద‌రాబాదీ సినిమాల‌తో నాకంటూ ఓ స్పెష‌ల్ క్రేజ్ అందించిన అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమాలోని నా పాత్ర కూడా ఖ‌చ్చితంగా అల‌రిస్తుంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతుండ‌టం నిజంగా హ్యాపీ.

హీరోయిన్ పెంటాలి సేన్ మాట్లాడుతూ... నేను హిందీ సినిమాల్లో న‌టించాను. గోల్‌మాల్ గుల్లు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ రాజేష్ పుత్ర‌గారికి థ్యాంక్స్.

•    న‌టీన‌టులు
గుల్లుదాదా(అద్నాన్ సాజిద్ ఖాన్)
ర‌ఘుబాబు
పెంటాలి సేన్,
ప్రియాంక‌,
వీఎన్ ప‌ద్మావ‌తి,
అక్భ‌ర్ ష‌రీఫ్,
హ‌స‌ఫ్ స‌మీర్,
ఖషీఫ్ అలీ,
మాస్ట‌ర్ ఆయాన్
స్టోరీ: ప‌్ర‌శాంత్ రూత్
కెమెరా: చ‌క్రి
మ్యూజిక్: కున్ని
ఎడిట‌ర్‌: స‌ర్తాజ్
ఆర్ట్ డైరెక్ట‌ర్: డేవిడ్
డైలాగ్స్: శ్రీ‌హ‌ర్ష‌ పిల్లా
అసిస్టెంట్ డైరెక్ట‌ర్:  కిర‌ణ్ మ‌న్నె
కో-డైరెక్ట‌ర్:  తాడి గోవిందు
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌
బెజ్జం రాజేష్ పుత్ర

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%